
జనరల్

మార్కాపురం జిల్లా దరిమడుగు ఎస్సీ పాలెం నుంచి జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసిన సమయంలో రహదారిపై మురికి నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు ఆ నీటిలోనే నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితిపై విద్యార్థులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీటిలో నడవడం వల్ల విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ పాలెం నుంచి పాఠశాల వరకు సరైన రహదారి నిర్మించి, విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కల్పించాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!