

దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలు కోసం పంచాయతీరాజ్ శాఖ, కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్) సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, గ్రామ పంచాయతీలకు చెందిన ఖాళీ స్థలాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఈ కేంద్రాల ఏర్పాటుతో గ్రామ పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు, పెట్రోల్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29,151 పబ్లిక్ ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఉండగా, ఈ సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!