
జనరల్

ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ బ్యాంకు ఉద్యోగులు నవంబర్ 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె ప్రభావంతో మంగళవారం బ్యాంకు శాఖల్లో సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేరుగా బ్యాంకు శాఖలకు వెళ్లి సేవలు పొందాలనుకునే ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ సేవలను వినియోగించుకోవాలని బ్యాంకు సూచించింది. ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంల ద్వారా కూడా ఉచితంగా నగదు ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. గో మొబైల్ ప్లస్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. కాబట్టి అత్యవసర లావాదేవీల కోసం ఖాతాదారులు డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!