

గత కొన్ని వారాలుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి పసిడి ధరలు పెరుగుతూ వస్తుండగా, దీపావళి, ధంతేరస్ పండుగల నేపథ్యంలో గత రెండు రోజులుగా డిమాండ్ మరింత పుంజుకుంది. దీంతో బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. పండుగ సమయానికి కొనుగోళ్ల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉండటంతో ధరలు కూడా పైకి వెళ్లవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం, వెండి ధరల కదలికలను కచ్చితంగా అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు. నవంబర్ 3, 2026 నాటి తాజా ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,640గా కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రూ.270 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,000కు చేరగా, రూ.250 పెరుగుదల నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,790గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,28,150గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,39,640, 22 క్యారెట్ల బంగారం రూ.1,28,000గా నమోదైంది. బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు, నవంబర్ 3న వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీ, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2 లక్షలుగా ఉండగా, చెన్నై, బెంగళూరులోనూ ఇదే రేటు కొనసాగుతోంది.
అయితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అమెరికా మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ధర ఏకంగా 3.63 శాతం తగ్గినట్లు సమాచారం. ఇది అంతర్జాతీయ మార్కెట్లో బలహీనమైన సెంటిమెంట్‌ను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత మూడు వారాల్లో బంగారం ధరలపై అమ్మకాల ఒత్తిడి 6 శాతానికి పైగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. దీపావళి, ధంతేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు రాబోయే రోజుల్లో ధరల కదలికలను గమనిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!