
జనరల్

కేవలం 80 కిలోల కోకో గింజలు, ఆరు చాక్లెట్ అచ్చులతో ఓ చిన్న గదిలో ప్రారంభమైన ప్రయాణం నేడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఉద్యోగాల కోసం నగరాల వెంట పరుగులు తీస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడకు చెందిన ప్రవీణ్ మాత్రం సొంతూరిలోనే వ్యాపారాన్ని ప్రారంభించి ప్రత్యేక గుర్తింపు సాధించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తితో చాక్లెట్ తయారీ రంగంలోకి అడుగుపెట్టి, స్థానికంగా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
మార్కెట్‌లో అనేక రకాల చాక్లెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. సహజమైన, స్వచ్ఛమైన చాక్లెట్లను వినియోగదారులకు అందించడమే తన లక్ష్యమని ప్రవీణ్ చెబుతున్నారు. చిన్న స్థాయిలో మొదలైన తన ఆలోచనను అంతర్జాతీయ గుర్తింపు పొందిన వ్యాపారంగా తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!