

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రవాసాంధ్రుడు ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు ఎక్కడ విజయం సాధించినా, వ్యాపారాలు ప్రారంభించినా, మంచి పేరు తెచ్చుకున్నా అది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారదర్శక పాలన, వేగవంతమైన అనుమతుల వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయాలని కోరారు.
ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెట్టేందుకు, ఆవిష్కరణలకు, భాగస్వామ్యాలకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని లోకేష్ తెలిపారు. ప్రతి పెట్టుబడిదారుడికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. దక్షిణ కొరియా అభివృద్ధి ప్రయాణం ఆదర్శప్రాయమని పేర్కొంటూ, శాంసంగ్, హ్యుందాయ్, ఎల్జీ, కియా వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను ఉదాహరణగా ప్రస్తావించారు. అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యాలను బలోపేతం చేసి రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!