
బిజినెస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ కొనసాగుతోంది. జనసేన పార్టీ బలోపేతం కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు మహీధర్ రెడ్డి, శిద్ధా రాఘవరావు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, ఆమంచి కృష్ణమోహన్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.
వచ్చే ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, పార్టీలో బాధ్యతలపై స్పష్టత వచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు జనసేనలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, ఈ చేరికలపై జనసేన పార్టీ గానీ, ఆయా నేతలు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!