
క్రీడలు

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)ను పునర్వ్యవస్థీకరించింది. కొత్త బోర్డులో వినోద రంగానికి చెందిన 18 మంది సభ్యులకు చోటు కల్పించింది. ప్రముఖ నటులు ప్రీతి జింటా, పంకజ్ త్రిపాఠి, సునీల్ శెట్టి, దర్శకుడు ప్రియదర్శన్, పల్లవి జోషి, రూపాలి గంగూలీ తదితరులు కొత్త బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమ నుంచి నిర్మాత సుప్రియ యార్లగడ్డకు కూడా కొత్త బోర్డులో అవకాశం లభించింది. అన్నపూర్ణ స్టూడియోస్‌తో అనుబంధంగా ఉన్న సుప్రియ, డాకోయిట్: ఏక్ ప్రేమ్ కథ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజా నియామకంతో భారతదేశంలో సినిమాల ధ్రువీకరణ ప్రక్రియలో ఆమె కూడా భాగస్వామి కానున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!