
జనరల్

ఇస్తాంబుల్ నుంచి ఖాట్మాండు వచ్చిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A330 విమానం ల్యాండింగ్ సమయంలో కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు చెలరేగాయి. విమానం భూమిని తాకే సమయంలో ఈ ఘటన జరగడంతో వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారు తక్షణమే మంటలను అదుపులోకి తెచ్చారు.
విమానంలో ఉన్న 270 మందికి పైగా ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. విమాన సిబ్బంది మరియు విమానాశ్రయ అత్యవసర బృందాల సమన్వయంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!