
జనరల్

జూబ్లీహిల్స్ మాజీ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యు. శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై మరింత విచారణ కొనసాగనుంది.
ఒక మహిళపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, బలవంతపు అబార్షన్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేశారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల అనంతరం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తదుపరి విచారణ వరకు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!