
జనరల్

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ప్రళయ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలో ఉదయం 11:10 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది. యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ పరీక్షలో క్షిపణి నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా చేరుకున్నట్లు DRDO వెల్లడించింది.
ప్రయోగ సమయంలో వివిధ రేంజ్ పరికరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడంతో పరీక్ష విజయవంతమైనట్లు నిర్ధారణ అయింది. ఈ విజయంతో స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. క్షిపణి అభివృద్ధి రంగంలో దేశ సాంకేతిక సామర్థ్యానికి ఈ ప్రయోగం మరో నిదర్శనంగా నిలిచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!