24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం...మరో కీలక ప్రకటన

Writer: Pooja 12:30 PM, 24 జూన్, 2026
ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం...మరో కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా అమలు చేయనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. పల్లె వెలుగు సేవల తరహాలోనే ఏసీ విద్యుత్ బస్సులను గ్రామాలకు కూడా నడపనున్నట్లు తెలిపారు. 2029 నాటికి మొత్తం 5,210 బస్సులను ఆర్టీసీలోకి తీసుకురానుండగా, 2031 నాటికి ఆర్టీసీలో పూర్తిగా విద్యుత్, సీఎన్‌జీ బస్సులే ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

స్త్రీశక్తి పథకం కింద ఇప్పటి వరకు 73.62 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం రోజుకు రూ.8.50 కోట్ల సబ్సిడీ అందిస్తోందన్నారు. దివ్యాంగ శక్తి పథకం కింద 38.22 లక్షల ప్రయాణాలు జరిగాయని చెప్పారు. ఈ రెండు పథకాల అమలు అనంతరం బస్సుల ఆక్యుపెన్సీ 69 శాతం నుంచి 92 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు.

కేంద్ర సహకారంతో రాష్ట్రానికి 1,000 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, వచ్చే ఐదేళ్లలో జీసీసీ విధానంలో 8,321 విద్యుత్ బస్సులను దశలవారీగా ప్రవేశపెడతామని తెలిపారు. పీఎం ఈ-బస్ సేవ పథకం కింద 11 నగరాల్లోని 12 డిపోలకు 750 విద్యుత్ బస్సులు కేటాయించగా, ఆగస్టు నుంచి అవి అందుబాటులోకి రానున్నాయి. తిరుపతికి అదనంగా 300 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఆర్టీసీ భూములు, డిపోలు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

పౌర్ణమి 2026: ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా శుభఫలితాలు.. కొత్త అవకాశాలు!

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..

దీపావళి 2026: ఈ 4 రాశుల వారికి కొత్త అవకాశాలు, శుభపరిణామాలు..

ట్యాగ్లు
ఆర్టీసీఉచిత ప్రయాణంవిద్యుత్‌ బస్సులుస్త్రీ శక్తిఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..
బిజినెస్

భారత రక్షణ రంగంలో మరో భారీ ఒప్పందం..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..
జనరల్

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు
జనరల్

ఉత్తరాంధ్ర అతలాకుతలం.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...
క్రీడలు

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఉషు స్టార్ రోషిబినా దేవి దూకుడు..

ది ప్యారడైజ్ రివ్యూ: నాని మాస్ అవతార్ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

ది ప్యారడైజ్ రివ్యూ: నాని మాస్ అవతార్ అంచనాలను అందుకుందా?

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..
జనరల్

ఏపీ మద్యం షాపుల రెన్యువల్‌కు గడువు ముగింపు..

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..
క్రీడలు

జపాన్‌లో బుమ్రా పిల్లో షాపింగ్‌పై సంజన సెటైర్..

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..
జనరల్

హోర్ముజ్ జలసంధిలో విదేశీ నౌకలపై ఇరాన్ కీలక నిర్ణయం..

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

‘మండాడి’ టీమ్‌కు కమల్ హాసన్ అభినందనలు.. సూరి ఎమోషనల్ పోస్ట్

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందు నాని భార్య అంజనా ఎమోషనల్ పోస్ట్..

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చాను మెరుపులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!