
బిజినెస్

పల్నాడు జిల్లాలో కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం, పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఆర్థిక సాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని పల్నాడు కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!