

నీట్ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ జంతర్‌మంతర్‌లో ఆందోళన చేపట్టిన నిరసనకారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. నిరసనల్లో పాల్గొన్న వారిపై కేసుల విషయంలో ముందుకు వెళ్లవద్దని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
జులై 29న జరిగిన ఆందోళనలకు సంబంధించి మొత్తం 13 కేసులు నమోదైనట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన "చలో పార్లమెంట్" కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి రావడంతో పోలీసులు లాఠీచార్జ్ నిర్వహించగా, పలువురిపై కేసులు నమోదయ్యాయి. అనంతరం నిరసనకారులపై చట్టపరమైన చర్యల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!