
జనరల్

ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) ప్రారంభోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల నుంచి సుమారు మూడు లక్షల మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉన్నందున కూటమి నాయకులు, అధికారులు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రధాని మోదీకి స్వాగతంగా సుమారు 13 వేల మందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేల బస్సులు రానుండగా, తాగునీరు, అల్పాహారం, భోజనం, ఎల్‌ఈడీ స్క్రీన్లు, లైజన్ అధికారులతో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!