

నల్గొండ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిగ్‌బాస్ తెలుగు 10 రియాలిటీ షోకు సంబంధించిన ఓటింగ్ ప్రచారం నిర్వహించారనే ఆరోపణలపై తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మమేకమైనట్లు కనిపిస్తున్న కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని కార్యాలయం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
పాఠశాలలు విద్య కోసం మాత్రమే ఉండాలని, రియాలిటీ షోల ఓటింగ్ ప్రచారం కోసం ఉపయోగించకూడదని జగదీశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలు విద్యా వాతావరణాన్ని ప్రభావితం చేయడంతో పాటు పిల్లల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తేలా చేస్తాయని అన్నారు. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రచారాలు జరగకుండా కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే బిగ్‌బాస్ రియాలిటీ షో ఓటింగ్‌కు 18 ఏళ్లు నిండిన వారినే అర్హులుగా నిర్ణయించాలని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!