

అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్, 2026 ఆసియా క్రీడలకు ముందు టీమిండియాకు భారీ ఊరట లభించింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందారు. దీంతో అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల్లోనూ బుమ్రా అందుబాటులో ఉండనున్నారు. మోకాలి గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఫిట్‌నెస్ పరీక్షలో సత్తా చాటడంతో భారత బౌలింగ్ విభాగానికి ఇది కీలక బలంగా మారింది.
అయితే మరోవైపు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హర్షిత్ రాణా గాయం కారణంగా అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్, ఆసియా క్రీడలకు దూరమయ్యారు. ఫిట్‌నెస్ పరీక్షల సమయంలో అతడికి మరోసారి హ్యామ్‌స్ట్రింగ్ గాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హర్షిత్ రాణా స్థానంలో యశ్ ఠాకూర్‌ను రెండు జట్లలోనూ ఎంపిక చేశారు. జింబాబ్వేతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన యశ్ ఠాకూర్ రెండు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!