10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు

Writer: Pooja 02:42 PM, 10 సెప్టెంబర్, 2026
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత హాకీ జట్టు

జూనియర్‌ మహిళల ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19-0 గోల్స్‌ తేడాతో చిత్తుగా ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. చైనాలోని మోకీ వేదికగా గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో భారత్‌ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఏడో నిమిషంలో పూజా సాహూ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. అనంతరం రోషిణి ఐంద్‌, తనుశ్రీ దినేశ్‌ కదూ, సుఖ్‌వీర్‌ కౌర్‌, సనికా చంద్రకాంత్‌ మనే వరుసగా గోల్స్‌ సాధించారు. 23వ నిమిషంలో మనే మరో గోల్‌ చేయగా, తనూజ, పూజా మాలిక్‌, పూర్ణిమా యాదవ్‌ కూడా గోల్స్‌ కొట్టారు. దీంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ 10-0తో ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలోనూ భారత జట్టు అదే దూకుడును కొనసాగించింది. పూజా మాలిక్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరవగా, సుప్రియా రెండుసార్లు గోల్‌ సాధించింది. క్రిష్ణా శర్మ, బినిమా ధన్‌, రోషిణి కూడా చక్కటి ఆటతీరుతో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచారు. చివరి నిమిషంలో రోషిణి మరో గోల్‌ చేయడంతో భారత్‌ 19-0తో ఘన విజయం సాధించింది. దీంతో భారత జట్టు ఆసియా కప్‌ సెమీఫైనల్‌కు చేరుకుంది. సౌత్‌ కొరియా-మలేషియా మధ్య జరిగే క్వార్టర్‌ఫైనల్‌ విజేతతో భారత్‌ సెమీఫైనల్‌లో తలపడనుంది. అంతకుముందు గ్రూప్‌ దశలో జపాన్‌, మలేషియా, సౌత్‌ కొరియాలను ఓడించి భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం

పాక్ అండర్‌-19 జట్టుకు చేదు అనుభవం

ట్యాగ్లు
జూనియర్ మహిళా హాకీఆసియా కప్ హాకీభారత మహిళా హాకీపాకిస్థాన్‌పై విజయంభారత హాకీ జట్టుహాకీ టోర్నీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..
క్రీడలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...
క్రీడలు

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
జనరల్

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు
జనరల్

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?
క్రీడలు

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు
జనరల్

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్
రాజకీయాలు

ప్రశ్నిస్తే అసెంబ్లీలో గొంతు నొక్కి సస్పెండ్ చేశారు: కేటీఆర్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...
క్రీడలు

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!