
టెక్నాలజీ

గుజరాత్‌లోని కచ్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన జీవితాన్ని అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ్‌గర్ గుసాయ్ తెలిపారు. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్యమం, ప్రధాని మోదీ తీసుకున్న పలు నిర్ణయాలు తనను ప్రభావితం చేశాయని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిణామాలే పోలీస్ ఉద్యోగాన్ని వీడి ఆర్ఎస్ఎస్, ప్రధానమంత్రికి మద్దతుగా పనిచేయాలనే ఆలోచనకు ప్రేరణనిచ్చాయని గుసాయ్ తెలిపారు. అయితే ఆయన రాజీనామాను అధికారులు ఇప్పటివరకు ఆమోదించలేదు. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ చేసిన ప్రకటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ అంశంపై ఆన్‌లైన్‌లో విస్తృత చర్చ జరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!