
జనరల్

మధ్య గగనతలంలో చోటుచేసుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఫ్లైదుబాయ్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలు కీలకంగా నిలిచాయి. 174 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ఆయన చూపిన తెగువపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
స్మిత్ మచ్చర్ ధైర్యం, త్యాగాన్ని గుర్తించిన ఆయన స్వరాష్ట్రం గుజరాత్ ప్రభుత్వం ‘విశిష్ట గుజరాత్ గరిమ అవార్డు’తో సత్కరించాలని నిర్ణయించింది. అవార్డుతో పాటు రూ.25 లక్షల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. స్మిత్ మచ్చర్ సాహసాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!