
జనరల్

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
బకాయిల కారణంగా కొన్ని కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. దీంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఉన్నత చదువులకు వెళ్లే అవకాశాలను కూడా విద్యార్థులు కోల్పోతున్నారని అన్నారు. సిద్దిపేట శ్రీకృప కాలేజీ విద్యార్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!