
జనరల్

సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం ఉదయం ముంబైలోని ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయనతో మాట్లాడిన సీఎం ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను, సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర మంత్రి గిరిష్ మహాజన్ కూడా సీఎం వెంట ఉన్నారు.
అన్నా హజారే త్వరగా కోలుకోవాలని, ఆయన నూరేళ్లు జీవించాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుక్డి జలవనరుల ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయాన్ని హజారేకు వివరించారు. దీనిపై హజారే హర్షం వ్యక్తం చేశారు. 89 ఏళ్ల అన్నా హజారే ఇటీవల ఇన్ఫెక్షన్‌తో బాధపడటంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!