

బస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రవాణా శాఖ, ఆర్టీసీ సాధించిన ప్రగతిని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 347.36 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు. ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ కూడా 67 శాతం నుంచి 89 శాతానికి పెరిగిందన్నారు.
ఆర్టీసీలో 2,932 కొత్త బస్సులు కొనుగోలు చేశామని, వీటిలో 1,024 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌లో మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఉద్యోగ నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల సంక్షేమం, బస్ స్టేషన్ల ఆధునీకరణ, డిజిటల్ టికెటింగ్ వంటి చర్యలను కూడా వివరించారు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ సమన్వయంతో చివరి మైలు వరకు కనెక్టివిటీ పెంచుతున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల విధానం ద్వారా కాలుష్య నియంత్రణకు, రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!