
సినిమాలు

మమితా బైజుకు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు దక్కుతున్నాయి. ఆమె నటించిన మూడు సినిమాలు కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో ఇంత తక్కువ సమయంలో మూడు రూ.200 కోట్ల సినిమాల్లో భాగమైన హీరోయిన్‌గా మమితా బైజు అరుదైన రికార్డు సృష్టించింది.
ఈ జాబితాలో దళపతి విజయ్ నటించిన జన నాయగన్ ముందుగా నిలిచింది. ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సూర్య సరసన నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ రూ.240 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా మమితా నటించిన మలయాళ చిత్రం బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ కూడా రూ.200 కోట్ల మార్క్‌ను దాటినట్లు సమాచారం. దీంతో వరుసగా మూడు చిత్రాలతో మమితా బాక్సాఫీస్ హ్యాట్రిక్ నమోదు చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!