

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల కళా నైపుణ్యం, కష్టం, అంకితభావానికి సెల్యూట్ చేస్తూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న నేతన్నలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. చేనేత రంగం అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి సమాజం మొత్తం అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పరిస్థితి మరింత దిగజారిందని హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన నేతన్నకు చేయూత, నూలు సబ్సిడీ, బతుకమ్మ చీరలు, వర్కర్ టు ఓనర్ వంటి పథకాలు చేనేత రంగానికి ఊపిరి పోశాయని, ప్రస్తుతం అవి నిలిచిపోవడంతో నేతన్నలు సంక్షోభంలోకి వెళ్లారని అన్నారు. మగ్గాలు మూగబోతున్నాయని, వలసలు, అప్పులు, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొంటూ, చేనేత రంగానికి మళ్లీ పునర్వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!