

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏషియన్ గేమ్స్-2026లో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. భారత్ క్రికెట్ జట్టులో భాగంగా ఉన్న 15 ఏళ్ల వైభవ్ బరిలోకి దిగితే, ఈ క్రీడల్లో పాల్గొనే అతి పిన్న వయస్కుడిగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్ తరఫున పాల్గొంటున్న 503 మంది అథ్లెట్లలో వైభవ్ అత్యంత చిన్నవాడు. మరోవైపు భారత అశ్వ క్రీడాకారిణి శృతి వోరా 55 ఏళ్ల వయసుతో దేశ బృందంలోని అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలిచారు.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ స్థానాల్లో కొనసాగుతుండటంతో ఏషియన్ గేమ్స్‌లోనూ పోటీ తీవ్రంగా ఉండనుంది. అయితే వైభవ్ భారత జట్టులోకి ఎంపికైన విషయం అధికారికంగా ఉంది. సెప్టెంబర్ 29న జరిగే పురుషుల క్రికెట్ క్వార్టర్‌ఫైనల్ నాటికి అతడు తుది జట్టులో చోటు దక్కించుకుని ఒక్క మ్యాచ్ ఆడినా, ఏషియన్ గేమ్స్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచే అవకాశం ఉంది. భారత పురుషుల జట్టు గత ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!