

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి తుఫానుగా మారడంతో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రంగారెడ్డి సహా మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రానున్న 24 గంటల్లో గాలి వేగం కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాలు కురిసే సమయంలో అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!