

భారీ వర్షాల కారణంగా ధర్మపురి సమీపంలో కొండపై నుంచి బండరాయి జారిపడి ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కోయిల్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం తెల్లవారుజామున సేలం దాటి ధర్మపురి జిల్లా ముత్తంపట్టి, శివాడి రైల్వే స్టేషన్ల మధ్య పర్వత మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో భారీ వర్షం కారణంగా పట్టాల పక్కనున్న కొండపై నుంచి బండరాయి జారిపడి దొర్లుకుంటూ వచ్చి నెమ్మదిగా వెళ్తున్న రైలు ముందు కోచ్ చక్రాల వద్ద బలంగా ఢీకొట్టింది.
బండరాయి ఢీకొనడంతో రైలు షాక్ అబ్జార్బర్ దెబ్బతింది. అప్రమత్తమైన లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం రైలును నెమ్మదిగా ధర్మపురి రైల్వే స్టేషన్‌కు తీసుకొచ్చి నిలిపారు. రైల్వే సాంకేతిక నిపుణులు దెబ్బతిన్న భాగాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టారు. పనులు పూర్తయిన తర్వాత రైలు సుమారు అరగంట ఆలస్యంగా తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!