

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుపర్చాలని తెలంగాణ హైకోర్టు డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించింది. నవంబర్ 17న రంగనాథ్‌ను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. కోర్టు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు ఎందుకు హాజరుకాలేదని న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రంగనాథ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆయనను కోర్టుకు తీసుకురావాల్సిన బాధ్యతను డీజీపీకి అప్పగించింది.
శంషాబాద్‌లోని 9.05 ఎకరాల భూమి స్వాధీనం వ్యవహారానికి సంబంధించి దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. భూమికి సంబంధించిన వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే కేసులో శంషాబాద్ తహసీల్దార్‌ను కూడా నవంబర్ 17న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అధికారిక విధుల్లో బిజీగా ఉన్నామనే కారణంతో న్యాయస్థానం ముందు హాజరుకాకుండా తప్పించుకోలేరని ధర్మాసనం స్పష్టం చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!