

యుద్ధాలు, సార్వభౌమ వివాదాలు, 13ఏళ్ల స్పెయిన్ బ్లాకేడ్‌కు కేంద్రంగా నిలిచిన జిబ్రాల్టర్‌లో చారిత్రాత్మక మార్పు చోటు చేసుకోబోతోంది. స్పెయిన్‌లోని లా లైనియా డి లా కన్సెప్సియన్‌కు దగ్గరగా ఉన్నప్పటికీ, బ్రిటన్ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరాలంటే ఇప్పటివరకు అంతర్జాతీయ సరిహద్దు దాటాల్సి వచ్చేది. రెండు వైపుల ప్రజలు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండేది. రోజూ ఉద్యోగాల కోసం ప్రయాణించే వేలాది మందికి ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. అయితే బుధవారం నుంచి ఈ పరిమితులను ఎత్తివేయడంతో స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు.
సుమారు 40,000 మంది జనాభా ఉన్న జిబ్రాల్టర్ ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. పర్యాటక, వ్యాపార రంగాల్లో ఇది కీలక కేంద్రంగా నిలిచింది. మరోవైపు సమీపంలోని స్పెయిన్ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం అధికంగా ఉండటంతో దాదాపు 15,000 మంది ప్రతిరోజూ జిబ్రాల్టర్‌కు వెళ్లి పనులు చేస్తుంటారు. సరిహద్దు తనిఖీలు తొలగించడంతో ఇకపై వారికి గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన అవసరం ఉండదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!