
జనరల్

సౌదీ అరేబియాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్లు యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ ప్రకటించింది. మారిబ్ ప్రావిన్స్ గగనతలంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. స్థానికంగా తయారు చేసిన క్షిపణితో సౌదీ యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు హౌతీ సైనిక ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కూడా హౌతీ అనుబంధ మీడియా విడుదల చేసింది.
అయితే, సౌదీ అరేబియా ఎఫ్-15 యుద్ధవిమానం కూల్చివేతపై ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. తాజా పరిణామాలతో సౌదీ బలగాలు, హౌతీల మధ్య యెమెన్‌లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హౌతీలు సౌదీ లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తున్నట్లు ప్రకటించగా.. సౌదీ నేతృత్వంలోని బలగాలు యెమెన్‌లో హౌతీ స్థావరాలపై వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!