
రాజకీయాలు

ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఆయన జైలుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఇండియా కూటమి తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!