

వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, చెరువుల కుచించుకుపోవడం, అనియంత్రితంగా పెరుగుతున్న ఎత్తైన భవనాల నిర్మాణం కారణంగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి పేరుగాంచిన నగరం ఇప్పుడు తీవ్రమైన ఉక్కబోత, వేడిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మానవ చర్యల వల్లనే నగరం “అర్బన్ హీట్ ఐలాండ్”గా మారుతోందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గాజు మేడలు, కాంక్రీట్ భవనాల పెరుగుదల వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గచ్చిబౌలి, కొకాపేట్, ఐటీ కారిడార్ వంటి ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ వేడిగా మారినట్లు నిపుణులు తెలిపారు. భూగర్భ జలాల తగ్గుదల, పచ్చదనం నష్టం ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.
ఈ పరిస్థితిని నియంత్రించడానికి దేశీయ చెట్ల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, గ్రీన్ బిల్డింగ్ విధానాలు, స్పాంజ్ సిటీ మోడల్ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ పార్కుల్లో తప్పనిసరిగా పచ్చదనం పెంపొందించాలని కూడా కోరుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నగరంలో వేడి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!