

హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం మరో అధునాతన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా పాడ్ కార్లతో నడిచే పర్సనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS)ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే నగరంలోని రద్దీ రహదారులపై ప్రయాణ ఒత్తిడి తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం లభించే అవకాశం ఉంది. తొలుత మూడు మార్గాల్లో ఈ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
వచ్చే ఏడాది నాటికి పాడ్ కార్ల ఆధారిత పీఆర్టీఎస్ సేవలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సంప్రదాయ ప్రజా రవాణాకు ప్రత్యామ్నాయంగా ఈ ఆధునిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీనివల్ల కీలక ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం తగ్గి, నగర రవాణా మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రతిపాదిత మూడు మార్గాలు, ప్రాజెక్టు వ్యయం, అమలు తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!