

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఝార్ఖండ్‌లో జరుగుతున్న ఆందోళనకు తాను వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కాలేదో స్పష్టం చేశారు. ‘మీరు ఇప్పుడు ఝార్ఖండ్‌కు ఎందుకు వెళ్లడం లేదు?’ అని మీడియా ప్రశ్నించగా.. తన బృందం ఇప్పటికే అక్కడికి వెళ్లిందని చెప్పారు. అంతేకాకుండా, ఉద్యమంలో తన కంటే విద్యార్థి నేత దేవేంద్ర నాథ్ మాహ్తోపైనే దృష్టి ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మాహ్తోతో వీడియో కాల్‌లో మాట్లాడిన దీప్కే.. రాంచీలో జరుగుతున్న ఉద్యమానికి సీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
ఝార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు రాంచీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భారీగా పాల్గొన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కానన్లను ఉపయోగించారు. గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మాహ్తో ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను రాంచీ సదర్ ఆసుపత్రికి తరలించారు. నియామక పరీక్షల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోరుతూ ఆందోళన కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!