
షోస్

సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరగాల్సిన మూడు రోజుల దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మెను యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) వాయిదా వేసింది. యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించే అంశంపై UFBU–IBA సంయుక్తంగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
సమ్మె వాయిదా పడటంతో సెప్టెంబర్ 28, సోమవారం నుంచి బ్యాంకులు సాధారణంగా పనిచేయనున్నాయి. ఉన్నతస్థాయి కమిటీ చర్చల అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని UFBU తెలిపింది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలన్న డిమాండ్ ఈ సమ్మెకు ప్రధాన కారణంగా ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!