
షోస్

చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్‌స్కిల్స్ కాంపిటీషన్–2026లో తెలంగాణ యువత ప్రతిభ చాటింది. లాజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో మెహ్రున్నిసా బేగం సిల్వర్ మెడల్ సాధించగా, క్యాబినెట్‌మేకింగ్ విభాగంలో యశ్వంత్ చారి కేశోజు మెడల్ ఫర్ ఎక్సలెన్స్ అందుకున్నారు. ఈ పోటీల్లో భారత్ ఆరు సిల్వర్ మెడల్స్, 20 మెడల్స్ ఫర్ ఎక్సలెన్స్‌తో 10వ స్థానంలో నిలిచింది.
షాంఘైలో జరిగిన ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున 70 మంది పోటీదారులు 63 నైపుణ్య విభాగాల్లో పాల్గొన్నారు. 2024లో లియోన్‌లో జరిగిన వరల్డ్‌స్కిల్స్ పోటీల్లో 13వ స్థానంలో నిలిచిన భారత్.. ఈసారి 10వ స్థానానికి చేరుకుంది. తెలంగాణ యువత సాధించిన ఈ గుర్తింపు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక శిక్షణ, పరిశ్రమల అనుసంధానం, అంతర్జాతీయ ప్రమాణాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!