
ఓటీటీ

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ వ్యక్తి జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలిపోవడంతో తీవ్ర గాయాలైన ఘటన కలకలం రేపింది. చిరు వ్యాపారి గోపాల్ సోని తన ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ నుంచి ఒక్కసారిగా పొగలు వస్తున్నట్లు గమనించాడు. వెంటనే దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా, చేతిలోనే అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో అతని తొడకు, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు.
ఈ ఘటనలో మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ప్రమాదానికి ముందు ఫోన్ వేడెక్కలేదని బాధితుడు తెలిపాడు. తాను ఈ ఫోన్‌ను రెండు సంవత్సరాల క్రితం కొనుగోలు చేశానని, పేలుడు సంభవించిన సమయంలో ఫోన్లో 90 శాతం ఛార్జ్ ఉందని వెల్లడించాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ఈ ప్రమాదం జరగడంతో స్థానిక మొబైల్ వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!