
జనరల్

అమెరికా కార్మిక శాఖ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్-1బి వీసాదారులను ఉద్దేశించి ఉపయోగించిన ‘ఇండెంచర్డ్ లేబర్’ (ఒప్పంద బద్ధ కార్మికులు) అనే పదజాలంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ తరహా వ్యాఖ్యలు బాధాకరమైన చారిత్రక, వలసవాద నేపథ్యాన్ని గుర్తుచేస్తాయని, అలాంటి పదాలను ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది.

భారత్, అమెరికా మధ్య ఉన్న ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు అమెరికా ప్రకటించిన చర్యలు దోహదపడవని భారతదేశం స్పష్టం చేసింది. హెచ్-1బి వీసాదారులను అలా వర్ణించడం అనవసరమని, సమర్థనీయం కాదని అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారం కీలకంగా ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదన్న సంకేతాన్ని భారత్ ఇచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!