
క్రీడలు

భవిష్యత్ యుద్ధాల సిద్ధతలో భాగంగా భారత సైన్యం డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలను నిర్వహించేందుకు ప్రత్యేక “బాజ్ బెటాలియన్”లను సిద్ధం చేస్తోంది. ఆపరేషన్ సిందూర్ వంటి అనుభవాల నేపథ్యంలో ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం స్పష్టమైంది.
ఈ బెటాలియన్‌లు శత్రు ప్రాంతాల్లో నిఘా, కచ్చితమైన దాడులు, దీర్ఘకాల సరిహద్దు పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించనున్నాయి. ఎంక్యూ-9బీ వంటి డ్రోన్ల సమాచారాన్ని విశ్లేషించి చర్యలు తీసుకోనున్నట్లు నిపుణులు తెలిపారు. అలాగే భారత ఆకాశ రక్షణ కోసం భార్గవాస్త్ర వంటి యాంటీ-డ్రోన్ వ్యవస్థల అవసరం ఉందని విశ్రాంత మేజర్ జనరల్ ఏకే సివచ్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!