

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కీలక సూచనలు చేశారు. పాత వాహనాల కోసం E10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలని ఆయన ప్రతిపాదించారు. BS4కు ముందు తయారైన వాహనాలు భారీ సంఖ్యలో దేశంలో ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయని, అధిక ఇథనాల్ మిశ్రమం ఉన్న ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు వాటి ఇంజిన్ పనితీరు, పాత రబ్బరు భాగాల మన్నికపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వాహనాలను అధిక ఇథనాల్ మిశ్రమానికి అనుగుణంగా మార్చడం సాధ్యమే అయినప్పటికీ, అందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.
అయితే E20పై చర్చను కేవలం వాహనాల పనితీరుకే పరిమితం చేయకూడదని అనంత నాగేశ్వరన్ సూచించారు. ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన పంటలకు డిమాండ్ పెరిగితే ఆహారం, పశుదాణా కోసం వాటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే భూమి, నీటి వనరుల వినియోగంపైనా సమగ్ర సమీక్ష అవసరమన్నారు. E20 వల్ల కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే ఆహారం, ఇంధనం, నీటి అవసరాల మధ్య సమతుల్యతను కాపాడేలా విధానాలు ఉండాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!