

భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా రీల్స్, వీడియో స్ట్రీమింగ్, ఫొటోలు, ఇతర ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎక్కువగా వినియోగించడం వల్ల మొబైల్ డేటా ఖర్చు భారీగా పెరుగుతోంది. టెలికాం రంగ గణాంకాల ప్రకారం బీహార్ సర్కిల్‌లో రోజుకు సుమారు 49.1 పెటాబైట్ల డేటా వినియోగం నమోదైంది. 48.7 పెటాబైట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 42.31 పెటాబైట్లతో ఉత్తరప్రదేశ్ (ఈస్ట్) మూడో స్థానంలో ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
దేశవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగంలో వీడియో, సోషల్ మీడియా యాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం ఇంటర్నెట్ డేటా వినియోగంలో యూట్యూబ్ వాటా సుమారు 24.3 శాతం కాగా, ఇన్‌స్టాగ్రామ్ 21.7 శాతం, ఫేస్‌బుక్ 17.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గూగుల్ సెర్చ్, ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాలు 5.2 శాతం, వాట్సాప్ 3.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక ప్రకారం భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు నెలకు సగటున 37 జీబీ డేటాను ఉపయోగిస్తున్నాడు. రాబోయే ఐదేళ్లలో ఇది దాదాపు 70 జీబీకి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!