

జంతర్ మంతర్‌లో జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి కార్యకర్త తండ్రిపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌కు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మూడు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 15న అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లలేర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రూ.50 వేల వ్యక్తిగత బాండ్, అంతే మొత్తానికి ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేశారు. ఈ మధ్యంతర బెయిల్ కాలంలో భరద్వాజ్ ప్రవర్తనను పరిశీలించి, అనంతరం ఆయన సాధారణ బెయిల్ పిటిషన్‌ను పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
బెయిల్ సందర్భంగా కేసుపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని, తనకు మద్దతుగా ప్రచారం నిర్వహించకూడదని, ఫిర్యాదుదారు కుటుంబాన్ని ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కోర్టు షరతులు విధించింది. బాధితుడు, అతని కుమార్తె లేదా సాక్షులను సంప్రదించరాదని, సాక్ష్యాలను ప్రభావితం చేయడం లేదా నాశనం చేయడం చేయకూడదని, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించకూడదని ఆదేశించింది. విచారణకు సహకరించడంతో పాటు చిరునామా, ఫోన్ వివరాలను పోలీసులకు అందించాలని పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 6న జరగనుంది. బెయిల్ విచారణ ఇన్ కెమెరా పద్ధతిలో జరిగినట్లు కోర్టు రికార్డుల ఆధారంగా వార్తా సంస్థలు తెలిపాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!