

బిగ్‌బాస్ తెలుగు 10 తొమ్మిదో రోజు ఎపిసోడ్ వినోదం, భావోద్వేగాలు, వాగ్వాదాలు, పోటీతో ఆసక్తికరంగా సాగింది. వినాయక చవితి సందర్భంగా బిగ్‌బాస్ పూజా సామాగ్రిని అందించడంతో కంటెస్టెంట్స్ సంప్రదాయ దుస్తుల్లో వేడుకలు నిర్వహించారు. మరోవైపు త్రిగుణ్, సుధీర్ మధ్య విభేదాలు కొనసాగాయి. సుధీర్ తన నమ్మకాన్ని కోల్పోయాడని త్రిగుణ్ చెప్పడంతో పాటు, సృష్టి విషయంలో జరిగిన పరిణామాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అనంతరం ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కెప్టెన్సీ పోటీ కోసం త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేష్ గౌడ, రోహిత్, ఝాన్సీ, రామ్ ప్రసాద్ ఎంపికయ్యారు. బిగ్‌బాస్ ఇచ్చిన బెలూన్స్ టాస్క్‌లో సరైన స్పెల్లింగ్ రాసిన కంటెస్టెంట్స్ ఇతరుల బెలూన్లను పగలగొట్టి కారణాలు చెప్పాల్సి వచ్చింది. మొదటి రౌండ్‌లోనే త్రిగుణ్ ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత రోహిత్, రామ్ ప్రసాద్, దేబ్జానీ తదితరులు వివిధ దశల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. చివరకు ఝాన్సీ, అమన్ మాత్రమే కెప్టెన్సీ రేసులో మిగిలారు. ఇదే సమయంలో గత వారం ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలో ఒకరిని తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించే అవకాశాన్ని ప్రేక్షకులకు బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ రీఎంట్రీ కోసం ప్రేక్షకుల ఓటింగ్ కీలకం కానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!