

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ఇరాన్ తన సాయుధ బలగాలకు ‘కోడ్ 100’ అత్యున్నత అప్రమత్తత స్థాయిని జారీ చేసినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సైనిక దాడి ముప్పు ఎదురైతే తక్షణం స్పందించేలా సైన్యం, భద్రతా దళాలను సిద్ధంగా ఉంచే స్థాయిగా ‘కోడ్ 100’ను నివేదికలు అభివర్ణిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యాంప్ డేవిడ్ పర్యటనను ముందుగానే ముగించుకుని వైట్‌హౌస్‌కు తిరిగి రావడం పశ్చిమాసియాలో మరింత ఉత్కంఠకు కారణమైంది. అయితే ‘కోడ్ 100’ జారీపై ఇరాన్ అధికారిక మీడియా లేదా అధికారిక వార్తా సంస్థల నుంచి ఇప్పటివరకు ధ్రువీకరణ రాలేదు.
‘కోడ్ 100’ అమలు చేస్తే ఇరాన్ సాయుధ దళాలను అత్యంత అప్రమత్త స్థితిలో ఉంచినట్లుగా భావిస్తారు. అయితే ట్రంప్ ముందస్తు వైట్‌హౌస్ రాకకు ఇదే కారణమని నిర్ధారించే అధికారిక సమాచారం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, యెమెన్‌లో హూతీలు–సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు, ప్రాంతీయ భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఇరాన్ సైనిక కదలికలపై కూడా తాజా నివేదికలు వెలువడుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!