

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. ఈ వారం ప్రారంభం నుంచి ఇరుదేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి. రాత్రివేళ ఇరాన్‌లోని పలు ప్రాంతాలను అమెరికా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్రమంలో క్షిపణి శకలాలు పెళ్లి వేడుక జరుగుతున్న ఓ ఇంటిపై పడటంతో చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు. దీనికి ప్రతిగా ఇరాన్ బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా అనుబంధ ఆస్తులపై ప్రతీకార దాడులు చేసింది.
అమెరికాకు ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ బలగాలు అమెరికాకు ఎప్పటికీ మర్చిపోలేని గుణపాఠం నేర్పుతాయని హెచ్చరించారు. తాజా దాడులు ప్రారంభమైన తర్వాత ఆయన నుంచి వచ్చిన తొలి స్పందన ఇదేనని తెలుస్తోంది. అమెరికా దాడులపై ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్ మొహెబి కూడా తీవ్రంగా స్పందించారు. తాము ఎందుకు దాడులు చేశామా అని అమెరికా చింతించేలా చేస్తామని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో కీలక రవాణా మార్గాల నుంచి సముద్రపు మందుపాతరలను తొలగించినట్లు అమెరికా ప్రకటించిన అనంతరం, ఇరాన్ మరోసారి వాటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందని ఆరోపిస్తూ అక్కడి రాకెట్ ప్రయోగ వేదికలపై అమెరికా దాడులు చేసింది. దీంతో నెల రోజులుగా స్తబ్దుగా ఉన్న ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!