2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

Writer: Chandrika 09:27 AM, 2 సెప్టెంబర్, 2026
‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీకి రూ.543.92 కోట్లను 2021 అక్టోబర్‌ 4 నుంచి 6 శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలంటూ యూఏఈ కోర్టు ఇచ్చిన డిక్రీని భారత్‌లో అమలు చేయాలంటూ హైదరాబాద్‌, రంగారెడ్డి కమర్షియల్‌ కోర్టుల్లో దాఖలైన ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వడ్డీతో కలిపి బకాయి మొత్తం సుమారు రూ.949.96 కోట్లకు చేరిందని పేర్కొంది. ఇప్పటికే ప్రసాద్‌ రూ.231.70 కోట్ల నగదు, తన కుమార్తె స్వాతి పేరిట ఉన్న భూమికి సంబంధించిన పత్రాలను పూచీకత్తుగా సమర్పించారు. వాటి విలువపై ఇరుపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో సుప్రీంకోర్టు రూ.250 కోట్ల విలువగా పరిగణించింది. కమర్షియల్‌ కోర్టులు మరో రూ.212 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేశాయి. వీటికి అదనంగా మరో రూ.200 కోట్లను రెండు వారాల్లోగా రిజిస్ట్రీ వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి కమర్షియల్‌ కోర్టులు ప్రధాన ఎగ్జిక్యూషన్‌ పిటిషన్లతోపాటు అనుబంధ దరఖాస్తులపై నాలుగు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రస్‌అల్‌ఖైమా వాదనల్లో ప్రాథమికంగా నిజం ఉన్నట్లు కనిపిస్తోందని, డిక్రీ అమలు కాకుండా ఆస్తులను వివిధ కార్పొరేట్‌ సంస్థల పేర్లపై ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలపై కమర్షియల్‌ కోర్టుల్లో ఇరుపక్షాలు వాదనలు వినిపించుకోవచ్చని తెలిపింది. నిమ్మగడ్డ ప్రసాద్‌ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోని సంస్థలను డిక్రీ అమలులోకి తీసుకురావచ్చా? వాటి కార్పొరేట్‌ నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలా? అనే అంశాలపై కమర్షియల్‌ కోర్టులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో నిమ్మగడ్డ ప్రసాద్‌ సంస్థలపై రస్‌అల్‌ఖైమా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

ట్యాగ్లు
నిమ్మగడ్డ ప్రసాద్వాన్‌పిక్‌ కేసుసుప్రీంకోర్టురస్‌అల్‌ఖైమాఆర్‌ఏకేఐఏయూఏఈ కోర్టు తీర్పుకమర్షియల్‌ కోర్టుఆంధ్రప్రదేశ్‌న్యాయ వార్తలుభారత సుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కలకలం..

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..
ఆరోగ్యం

పచ్చి పసుపు మంచిదేనంటున్న డాక్టర్లు..

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...
బిజినెస్

భారత సెక్యూరిటీల్లో అమెరికా భారీ పెట్టుబడులు...

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

‘వాన్‌పిక్‌’ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..
క్రీడలు

ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐ కఠిన నిబంధనలు..

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం
జనరల్

పోలవరం జిల్లాలో మలేరియా మాత్రలు వికటించి కలకలం

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..
జనరల్

అమెరికా-ఇరాన్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
జనరల్

మాజీ సీఎం వైఎస్సార్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు
జనరల్

కఠిన చర్యల వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

జామ ఆకులతో షుగర్ కంట్రోల్? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!