

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా.. బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌పై పరోక్షంగా సెటైర్ వేశారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో పర్యటించిన కంగనా.. అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై అధికారులను నిలదీసిన వీడియోను మహువా మొయిత్రా తాజాగా షేర్ చేశారు. తన కృష్ణానగర్ నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు, ఎంపీ నిధులు నిధుల వినియోగంపై వచ్చే వారం అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
మహువా మొయిత్రా సోమవారం నదియా జిల్లా యంత్రాంగాన్ని ట్యాగ్ చేస్తూ ఈ మేరకు పోస్ట్ చేశారు. చాప్రా బస్‌స్టాండ్, పట్టబుకా ఆడిటోరియం తదితర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కంగనా షేర్ చేసిన వీడియోలో.. మండి నియోజకవర్గానికి కేటాయించిన రూ.11 కోట్ల నిధులతో ఒక్క పని కూడా చేపట్టలేదని ఆమె అధికారులను ప్రశ్నించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ వీడియోను మహువా షేర్ చేయడంతో ఇద్దరు ఎంపీల మధ్య పరోక్ష రాజకీయ విమర్శలు, సెటైర్లు చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!