4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

Writer: Pooja 11:15 PM, 4 సెప్టెంబర్, 2026
జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

తెలంగాణలో 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అర్హులైన ప్రజల ఆస్తులను 22-A జాబితా నుంచి తొలగించి వారి ఆస్తిహక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన దీక్ష నిర్వహించారు. జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పిలుపుతో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలకు చెందిన పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువతతో పాటు 22-A సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆస్తిహక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, 22-A సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య కొంతమందికి మాత్రమే సంబంధించినది కాదని, అనేక మంది ప్రజల భూములు, ఆస్తులు, జీవితాలతో ముడిపడి ఉందని అన్నారు. బాధితులకు న్యాయబద్ధమైన పరిష్కారం లభించే వరకు జనసేన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ చట్టబద్ధంగా సంపాదించుకున్న భూములు, ఆస్తులపై అనవసరమైన ఆంక్షలు లేకుండా ప్రభుత్వం స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులు తమ భూములు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను జనసేన నాయకులకు అందజేసి, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

ట్యాగ్లు
జనసేన22-A భూముల సమస్యతెలంగాణ రాజకీయాలుఆస్తిహక్కులుఇందిరాపార్క్ నిరసనజనసేన తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం
రాజకీయాలు

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన
జనరల్

జనసేన నిరసన దీక్షకు భారీ స్పందన

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌
సినిమాలు

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!