

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సర్వీసెస్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రతిపాదిత ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో కంపెనీ ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పత్రాలను సెబీకి సమర్పించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సుమారు 3.8 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.37,700 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.
డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ 27 కోట్ల వరకు కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇవి ఇష్యూ అనంతరం కంపెనీ మొత్తం ఈక్విటీ బేస్‌లో దాదాపు 2.9 శాతంగా ఉండనున్నాయి. కంపెనీ విలువను సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. సాధారణ వ్యాపార అవసరాలతో పాటు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు సంబంధించిన కొన్ని బకాయిల చెల్లింపులకు కూడా ఐపీఓ నిధులను వినియోగించే అవకాశం ఉంది. టెలికాం, 5జీ రంగాల్లో జియో బలమైన స్థానంలో ఉండటంతో ఈ ఐపీఓపై రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు ఇతర మదుపర్లలోనూ భారీ ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!